Sunday, April 5, 2009

“తాడేపల్లి” వ్యాఖ్యకు స్పందన

తాడేపల్లి Says:

కొంతమంది చేసే నేరాలకు టోకుగా మగజాతిని పేర్కొని నిందించడం నాటుగా అసహ్యంఉంది. అదే, ఆడవాళ్ళని నిందిస్తే sexism అంటారు. ఏం ? ఆ గౌరవానికి మగవాళ్ళు అర్హులు కారా ? ఆడముండలు అంటే ఎంత తప్పో మగమృగాలు అనడం అంతే తప్పు.

విషయం విశదంగా చెప్పడం కోసం గ్రామ్యం వాడాల్సి వచ్చింది. ఏమీ అనుకోవద్దు.

ఓ రాత్రి క్రిక్కిరిసిన బస్సులో ఇంటికెళుతున్నా. దారి మధ్యలో ఓ నడి వయస్సు స్త్రీ బస్సెక్కింది. అప్పటికే బస్సు నిండి ఉండటం, ఊతంగా బస్సులో ఉండే కమ్మీని సైతం అందుకోలేనంత పొట్టిగా ఉండటంతో “స్త్రీలు” అని వ్రాసి ఉన్న సీట్లలో కూర్చుని ఉన్న ఓ యువకుడిని సీటివ్వమంటూ బ్రతిమాలుకుంది.

అప్పుడా యువకుడు ఏమన్నాడో తెలుసా..
మీరు (ఆడవారు) మాత్రం పురుషుల సీట్లలో కూర్చోగా లేనిది, మేము ఆడాళ్ల సీట్లలో కూర్చుంటే ఏం? మా సీట్లలో కూర్చున్నప్పుడు మిమ్మల్ని లేవమంటే లేస్తారా? మేము మాత్రం మనుష్యులం కాదా? అంటూ ఆవిడపై మండిపడ్డాడు.

కొన్ని కొన్ని విషయాల్లో కొందరికే ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని కదా ఆర్యోక్తి. ఈ సృష్టిలో స్త్రీలకే పరిమితమైన కొన్ని శారీరక బలహీనతలు ఉన్నాయి, ఉంటాయి. ఇందులోనూ కొందరికి మినహాయింపు లభించవచ్చు. తక్కిన వాళ్లతో పోల్చితే, స్త్రీలను భారతీయులు బాగా గౌరవిస్తారని ప్రపంచ ప్రజల నమ్మకం. అలాంటి నమ్మకాలకు, విలువలకు తిలోదకాలిచ్చే ఇలాంటి వికృత చేష్టల మూలంగా యావద్భారతావని సభ్య సమాజం ముందు సిగ్గుతో తల వంచుకుంటోంది.

ఒక్క రాజకీయ నాయకుడు చేసిన తప్పుకు మొత్తం రాజకీయ వ్యవస్థను, లంచగొండియైన ఒక్క పోలీసు మూలంగా పోలీసు శాఖ మొత్తాన్ని మీరెప్పుడు విమర్శించలేదేమో నాకు తెలియదు. సగటు భారతీయునిగా, అందులోనూ ఆంధ్రునిగా మన రాష్ట్రంలో జరిగే ఇలాంటి అరాచకాలపై నేను గతంలోనూ స్పందించాను, ఇకపై కూడా స్పందిస్తాను.

ఇక మీరు ఉపయోగించిన గ్రామ్యం గురించి నేనేమీ బాధపడటం లేదు. సంస్కారంపై ఆధారపడి వ్యావహారిక భాష ఉంటుంది. మీకు మాత్రమే సాధ్యమయ్యే ‘సరళమైన’ భాషలో మీరు స్పందించినందుకు ధన్యవాదాలు. “ఆడముండలు” అనేటటువంటి పద ప్రయోగాన్ని నేనైతే ఉపయోగించలేను. ఎందుకంటే నాకు “అమ్మ” ఉంది.

0 comments: