మెట్లు దిగుతూ కాలుజారి కిందపడిన స్నేహితుడికి విద్యుల్లేఖ..
కాలు విరిగిన కష్టాల్లో ఉన్నాడు కదాని కాసింత హాస్యం రంగరించి ఇలా సంధించాను
పడడమే పనిగా పెట్టుకున్న పిల్లవాడా!
పద్ధతిగా పడ్డావా
పలకరింపులకే పడ్డావా - లేకుంటే
పరదా చాటునున్న పదారేళ్ల పడుచు
పకపకలకు పడ్డావా!!
పడినచోటే ఉన్నావా లేక
పరుగులెత్తి పారిపోయావా!!
“ప” పదాలతో పరిచిన
పద్యాన్ని చదివి
పకపకా నవ్వుతావా
పళ్లు కొరుకుతూ
పడగలెత్తి బుసలు కొడతావా!!
ఎక్స్‌ట్రాలొద్దమ్మా, ఒళ్లు జాగ్రత్త అంటూ పద్ధతిగా అవతలి వాళ్లు
హెచ్చరిస్తూ ఓ మెయిల్ పడేసారు..
మనం ఊరుకోం గదా! ఈ విధంగా ప్రత్యుత్తరం పంపేశాం..
పదుగురి క్షేమం కోరే
పసిడి మనస్సు గల అన్నవు..
పవన పుత్రుడికి సరిజోడివి
పాశుపతాస్త్రధారివి నీవుండగా..
పాపం.. దరిచేరునా సాక్షాత్తూ
పది తలల పన్నగమైనా
పారునా.. ఏ నీచుని దుష్ట
పన్నాగమైనా
పొగిడానో, తిట్టానో తెలీని అయోమయంలో మిత్రుడు
ఇంకా తంటాలు పడుతూనే ఉన్నాడు..
పాపం..
ఇంకా తంటాలు పడుతూనే ఉన్నాడు..
పాపం..
0 comments:
Post a Comment