Friday, February 18, 2011

తెలంగాణా విభజన – ఆత్మహత్యా సదృశమే..!!

మిత్రులు (చందమామ) రాజుగారు commented – “తెలంగాణాను దోచుకునేందుకు..!” on December 29th, 2009 -

సినీ రంగంలో దాదాపు 20 సంవత్సరాలు వెకిలి కామెడీలు చేసిన ఆలిండియా అందగాడు బాబూమోహన్ మీకు గుర్తున్నాడా? కొడుకు హఠాన్మరణంతో అతని వెండితెర జీవితం ఒక్కసారిగా కుదేలైపోయింది. మరో కొడుకుతో తీసిన సినిమా కూడా తూతూమంత్రంగా చీదేసేటప్పటికీ అతను ఒక సరిక్రొత్త వివాదానికి తెరతీసాడు… – ఏమని.. తాను “దళితుడు” అయినందువల్లనే దర్శక నిర్మాతలు తనతో వెకిలి కామెడీలు చేయించారని, గాడిదకు తాళి కట్టే సీన్లు, కాలితో తన్నించుకునే సీన్లను తనపై చేసారని పెద్ద దుమారమే రేపాడు. (ఇంచుమించు ఆ సమయంలోనే స్వర్గీయ శోభన్‌బాబు గురించి మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో రచ్చకెక్కాడనుకోండి..)

ఈ సమయానికే తెలంగాణా రామాయణంలో బాబూమోహన్ పిడకలవేట ఏమిటనే సందేహం మీకొచ్చే ఉంటుంది..

తెలంగాణావాదుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే సందర్భాలు, సంఘటనలు సంభవించినప్పుడే వాటిని ఎదుర్కొనే తీరులో ఎదుర్కొని ఉంటే సమస్యకు అంతిమ పరిష్కారం విడిపోవడం అనేది అయ్యి ఉండేది కాదు. ఇన్ని దశాబ్దాలుగా దాన్ని నాన్చి, నాన్చి ఇక్కడ వరకు తెచ్చారు. అంతెందుకు – మన పొరుగున ఉండే తమిళనాడులో ప్రముఖ హీరో విజయ్ నటించిన ఓ సినిమాలో న్యాయవాదులను కించపరిచే సన్నివేశాలున్నాయని అక్కడి న్యాయవాదులందరూ రచ్చకెక్కారు. ఆ హీరో క్షమాపణలు చెప్పాడనుకోండి. ఆ తర్వాత అలాంటి సన్నివేశాలను చిత్రీకరించేందుకు మిగతావారు వెనుకడుగు వేసారు, వేస్తారు కూడా. అంతేగానీ, ఇలాంటి సంఘటనలను తక్షణమే స్పందించకుండా దాని గురించే ఓ 40, 50 ఏళ్లు ఆలోచిస్తూ ఉపేక్షించడం తప్పని మాత్రమే నా భావన. వీటన్నింటికీ పరిష్కారంగా ఇప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టడం అని వాదించడం సరికాదు కదా.

మన బాబూమోహన్‌నే చూడండి – వేషాలు వచ్చినన్ని రోజులూ చేసాడు, సంపాదించాడు, చక్కగా స్థిరపడ్డాడు. గతంలో అతను ఇలాంటి వేషాలు నేను చేయను అంటూ వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయా? అవసరార్థం, స్వప్రయోజనార్థం అప్పుడు ఒప్పేసుకుని, చేసేసి ఇప్పుడేమో “దళిత” మాస్క్ వేసుకుని ప్రకటనలు గుప్పించేయడం సరి కాదు.

ఇప్పుడేమో మన ఓయూ విద్యార్థులు, తెలంగాణా వేర్పాటువాదులు అందరూ నిరాహార దీక్షలు చేస్తున్నారు – దేని కోసం.. రాష్ట్రాన్ని విడగొట్టమని. అంతేగానీ, వీళ్లల్లో ఏ ఒక్కరైనా, ఎప్పుడైనా మా కోసం ఒక డ్యామ్ కట్టండి, మా కోసం ఒక ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయండి, మా ప్రాంతంలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టండి అని ఎప్పుడైనా దీక్షలు చేసినట్లు చరిత్ర ఉందా? (ఇది తెలంగాణాకే కాదు, యావద్భారతానికి వర్తిస్తుంది..) విడిపోవడం సమస్యలకు పరిష్కారమా? చేతనైతే అలాంటి దీక్షలు చేపట్టమనండి. అప్పుడు మనస్సుండే ప్రతి తెలుగువాడూ వాళ్ల దీక్షకు సంఘీభావం ప్రకటిస్తారు. కాదని మీరు, మరొకరు వ్యతిరేకించగలరా?

మీరన్నట్లు – తెలంగాణా ఆత్మగౌరవార్థం ప్రత్యేక రాష్ట్రాన్ని మంజూరు చేసారనే అనుకుందాం.. అప్పుడు సినిమాల్లో వాళ్ల యాసను కించపరిచే సన్నివేశాలుండవని ఎవరైనా హామీనివ్వగలరా? ఇప్పటికీ మన తమిళ సినిమాల్లో తెలుగు భాష, యాసతో పాటు అక్షరాలను సైతం కించపరుస్తూనే ఉంటారే – జిలేబీలు చుట్టినట్లుగా గందరగోళంగా ఉంటాయని.. తమిళనాడు నుండి మనం విడిపోయి ఎన్ని సంవత్సరాలు గడిచాయి మరి?

మీ వ్యాఖ్యలో -
1. ‘మీ నాయకుల చేతకానితనాన్ని మీరు ప్రశ్నించరెందుకు’ అంటూ వారిని దెప్పడం సమస్యకు పరిష్కారం కానేకాదు.
2. తెలంగాణాలో నిజమైన బాధితుల సమస్యను పట్టించుకోకుండా కేవలం అక్కడి రాజకీయ నేతల స్వార్థం మీద మాత్రమే బాణం ఎక్కుపెడితే మరింత ఆవేశకావేషాలు పెరగడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఒరగదు.

మొదటిదానికి నా జవాబు -
ఇప్పుడు తెలంగాణాను విడగొట్టడానికి చేతులు కలిపిన నాయకుల్లో ఎన్నో ఏళ్లు ఎన్నో హోదాల్లో, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పదవులు వెలగబెట్టిన వారున్నారు. వారు ఆ ప్రాంత అభివృద్ధికి ఎంత కృషి చేసారు.. అలాంటి వారి దొంగ దీక్షలకు తలొగ్గి ఇప్పుడు తెలంగాణా అనే ప్రాంతాన్ని విడగొడితే ఆ ప్రాంతాన్ని వీరు అభివృద్ధి చేయగలరా? అసలు ఆ నాయకులకు తెలంగాణా ఇమ్మని అడిగే నైతిక హక్కు ఉందా?

అక్కడి అక్షరాస్యతా శాతం ఎంత? పన్నుల రూపంలో లభించే ఆదాయమెంత? అక్కడి సగటు జీవి తలసరి ఆదాయమెంత? తెలంగాణా ఇచ్చేస్తే రాత్రికి రాత్రి అల్లా ఉద్దీన్ కథలోలా ఏమైనా అద్భుతాలు జరిగిపోతాయా?

జల వనరులను వినియోగించుకోవడానికి రోడ్ల మీద గోడలు కట్టినట్లు ప్రాజెక్టులు కట్టెయ్యలేరుగా? ఆ అనుమతులను వారు పొందగలరా? పొందగలిగితే అదేదో కలిసి ఉండే చేసుకోవచ్చుగా. అందుకే మీ నాయకులను ప్రశ్నించండి అని నేను వారికి వారు మర్చిపోయిన వాళ్ల హక్కును గుర్తుచేసానే తప్ప దెప్పలేదు, దెప్పను, దెప్పడం నా అభిమతం కాదు.

ఇక రెండోది -
నా మొత్తం బ్లాగ్ పోస్ట్ సారాంశం అదే మహాశయా.. నిజమైన బాధితుల సమస్యలను పట్టించుకోండి అనే. నీతిమాలిన రాజకీయులను నమ్మి మోసపోవద్దనే. బాధితుల సమస్యలను పట్టించుకోవడమంటే రాష్ట్ర విభజనకు సై అనడం కాదు కదా. అక్కడ సర్వతోముఖాభివృద్ధికి బీజాలు వేయమనే కానీ కపట దీక్షలకు పొంగిపోయో, లొంగిపోయో అనవసర ఆవేశాలకు లోనయ్యో ప్రాణాలు తీసుకోవద్దనే.. అభివృద్ధిపరచమని అడిగేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది, ఆత్మగౌరవానికి భంగం కలిగితే తిరగబడే హక్కూ ఉంది, కానీ – విడిపోవడమే పరిష్కారమా..?

తెలంగాణాను విడగొట్టడమనేది నూటికి నూరు శాతం ఆత్మహత్యా సదృశమే తప్ప మరొకటి కానే కాదు…!

మీ స్పందనకు నా ప్రతిస్పందన సముచిత రీతిలో ఉందనే భావిస్తూ..

5 comments:

Unknown said...

baaga raasaaru. kakapote peacefull ga telanagaana vaste kottaga vachhe nashtamemi vundadu.
alage TRS balam ga vunnanaallu T state raadu. vallu balam ga vunnappudu T state vaste appudu meeru pettina heading correct avutundi.

Anonymous said...

The problem with bogs is that every Tom, Dick and Harry thinks he is an intellect and gets ready to preach.

Next time before writing such shit, do some homework yourself. get some data about these:
-approved water projects in telangana that never got started, unapproved water projects, projects without net water allocation in seemandhra that are completed or about to be completed.
-income from telangana and seemandhra, expenses in telangana and andhra
-gentleman pact, 6 point formulae, 610 Go, giglani comission

It is sick toread and answer to people who write blogs without basic idea.

Goutham Navayan said...

మొన్న జీ పీ ఇలాంటి చర్చిల్ గారి కోటే షాన్ నే గుర్తు చేసాడు.
" మీకు స్వాతంత్రం ఇస్తే పరిపాలించుకోవడం రాదు, కులం మతం ప్రాంతం బాష పేరిట
కొట్టుకుని చస్తారు" అని అన్నాడట వాడు (చర్చిల్ గాడు) అది ఇప్పుడు నిజం గానే జరుగుతోందట.
రేపు తెలంగాణా ఇస్తే మీలో మీరు ఇట్లాగే తన్నుకు చస్తారు అని జే పీ మనసులో మాట కావచ్చు.
ఇప్పుడు మీరు చేస్తున్న వాదన కూడా అలాగే వుంది.
మీ వాదనలో తెలంగాణా అన్న పదాన్ని తీసేసి భారత దేశం అన్న పదాన్ని చేర్చి ఆంద్ర స్థానం లో
బ్రిటీష్ వాడిని ఊహించుకుంటే
కచ్చితంగా మీకు కూడా ఇది దగుల్భాజీ వాదన అని అర్ధ మవుతుంది.
మానాయకులను చవటలు దద్దమ్మలని ప్రతి తెలంగాణా వాది తిట్టి పోస్తున్న విషయం మీరు
కచ్చితంగా మీకు కూడా ఇది దగుల్భాజీ వాదన అని అర్ధ మవుతుంది.
మానాయకులను చవటలు దద్దమ్మలని ప్రతి తెలంగాణా వాది తిట్టి పోస్తున్న విషయం మీరు చూడటం లేదా ?
మా నాయకుల స్వార్ధం, పిరికితనం, బానిస మనస్తత్వం వల్లనే కదా మా తెలంగాణా ఇంతగా అన్యాయానికి గురయింది.
ఇంకా మేకవన్నె పులుల్లాంటి పరాయి వాళ్ళని ఎం దేబిరిస్తాం. ఎందుకు దేబిరించాలి. అందుకే మా తెలంగాణా మాగ్గావాలే, మా నీళ్ళు మాగ్గావాలే , మా ఉద్యోగాలు మాగ్గావాలే మా నిధులు మాకు దక్కాలే, మాకూ స్వాతంత్రం కావాలె అని ముక్త కంఠం తో నినదిస్తున్నాం.

sreeviews said...

@ గౌతం, గారూ..
"మీకు స్వాతంత్రం ఇస్తే పరిపాలించుకోవడం రాదు, కులం మతం ప్రాంతం బాష పేరిట
కొట్టుకుని చస్తారు" అని అన్నాడట వాడు (చర్చిల్ గాడు) అది ఇప్పుడు నిజం గానే జరుగుతోందట.
రేపు తెలంగాణా ఇస్తే మీలో మీరు ఇట్లాగే తన్నుకు చస్తారు అని జే పీ మనసులో మాట కావచ్చు.
ఇప్పుడు మీరు చేస్తున్న వాదన కూడా అలాగే వుంది."

JP గారు అన్నది తెలంగాణ వారి గురించేనని మీరెందుకు అనుకుంటున్నారో తెలియడం లేదు. తెలంగాణ ఇస్తే మీలో మీరు తన్నుకు చస్తారు అని నేనెక్కడా అనలేదు. ఇలా మీలో మీరు రకరకాలుగా ఊహించేసుకుంటూ తక్కినవారందర్నీ శత్రువులుగా ఎందుకు చూ(భావి)స్తున్నారు?

విడిపోదాం అని ఈ స్థాయిలో చేసే పోరాటాన్నే అభివృద్ధి వైపుకు ఎందుకు మలచుకోలేకపోతున్నారు?

ఇప్పటికిప్పుడు రాష్ట్రాన్ని విభజించేస్తే తెల్లారేసరికి తెలంగాణ అభివృద్ధి చెందేస్తుందా?

కొందరు రాజకీయ నిరుద్యోగులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆడే నాటకంలో సామాన్య ప్రజానీకాన్ని కూడా పావులుగా వాడుకుంటున్నారు. తమ వ్యక్తిగతాభిప్రాయాలను జనాలపై బలవంతంగా రుద్ది, మీ వంటి వారిని తయారు చేస్తున్నారు. మొన్నటికి మొన్న శ్రీకృష్ణ కమిటీ నివేదికలో తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంత మేరకు తెలంగాణ విభజనను కోరుకుంటున్నారో బట్టబయలైందిగా..?

Anonymous said...

శ్రీ గారూ
మీరు ఇంకా ''అభివృద్ధి...రాజకీయ నిరుద్యోగులు...ప్రజలు పావులు.. శ్రీకృష్‌ణ కమిటీ నివేదిక ...వగైరా

అరిగిపోయిన పదాలతో తెలంగాణా ప్రజా ఉద్యమాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేయడం శోచనీయం.

మీ మీడియా మిమ్మల్ని ... మొత్తం ఆంధ్ర ప్రజల్ని అట్లా తయారు చేసింది.....!
(అది ఎన్నడూ తెలంగాణా ఉద్యమాన్ని, ఉద్యమ వార్తలని యధాతధంగా చూపిన పాపాన పోలేదు. అంతా

వక్రీకరణ, వాస్తవాలని తొక్కిపెట్టడం, అవహేళన చేయడం, నెగెటివ్‌గా చిత్రించడమే)

డ్రైవర్‌ మల్లేష్‌ జెపీ తల మీద ఒక్క చప్పిడి దెబ్బ వేస్తే ....
మీ మీడియా జేపీని పదేపదే కొట్టినట్టు 24 గంటలపాటు చూపించి చూపించి చూపించి జేపీ బుర్రని నిజంగా

బద్దలు కొట్టారు.
తెలంగాణా ఉద్యమకారులను మరింత రెచ్చగొట్టారు.
అందుకే...
ఆనాడు జార్జి బుష్‌ మీదకు బూటు విసిరిన వ్యక్తి ధైర్య సాహసాలని ప్రపంచం ఎంత కీర్తించిందో...
ఇవాళ జేపీ తలపై మొట్టికాయ వేసిన మల్లేష్‌ని అంతకంటే ఎక్కువగా ఆకాశానికి ఎత్తుతోంది.
రేపు మల్లేష్‌ విడుదలై వచ్చిన తర్వాత చూడండి అతనికి ఎంత గొప్ప సన్మానసత్కారాలు లభిస్తాయో

తెలంగాణాలో.
ఇదంతా స్వయంకృతాపరాథమే!

మీరు మరొక్కసారి ఆరోజు జేపీ అన్న మాటల్ని వినండి.
ప్రతి అక్షరం తెలంగాణా ప్రజా ప్రతినిధులను, తెలంగాణా ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదే అన్న

సత్యం మీకు కూడా బోధపడుతుంది.
తెలంగాణా ఆభివృద్ధి అన్యాయం... శ్రీకృష్ణకమిటీ నివేదిక గురించి మన బ్లాగుల్లోని రెండు ఈ కింది

టపాలను చూడండి. కొంతైనా మీకు సత్యం బోధపడుతుంది.

http://laahiri.blogspot.com/2011/02/108.html

http://dracharyaphaneendra.wordpress.com/
- Goutham Navayan