Thursday, May 15, 2008

ఈ కథను ముగించరూ.. ప్లీజ్!

నమస్కారం..

సుదీర్ఘ విరామానంతరం మిమ్మల్ని కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది.

అప్పుడెప్పుడో కవి పుంగవుడు “ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం” అని సెలవిచ్చినట్లు -

బ్లాగుల్లో కథలు, కవితలు, అనుభవాలు, అనుభూతులు, సరదా సంఘటనలు, మరెన్నో.

కాదేదీ కవితకనర్హం పాత మాట.

మరి నేటి పరిస్థితి - కాదేదీ బ్లాగడానికి అనర్హం.

కదా…

ఈ రొటీన్ బ్లాగడాలకు భిన్నంగా (పాతదైనప్పటికీ) మరో పద్ధతిని ప్రవేశపెడదామని అనుకుంటున్నాను. దానికి మీ సహకారం ఎంతైనా అవసరం.

నాకు తెలిసి - గతంలో ఏదో వారపత్రికలో ఓ ఫీచర్ ఉండేది. కథలో ఏ మర్డరో, దొంగతనమో చేసి, దాన్ని సగంలో ఆపేసి దానికి ముగింపును పాఠకుడినే ఇవ్వమనడం అన్నమాట.

ఇప్పుడు అదే పంథాలో “ఈ కథను ముగించరూ.. ప్లీజ్!” అనే శీర్షిక కింద సగంలో ఆపేసిన కథను మీరు బ్లాగుల్లో వ్యాఖ్యానాలు (comments) రూపంలో పూరించేసి మీ మీ నైపుణ్యాన్ని, రచనా తృష్ణను తీర్చుకోవచ్చు.

ఎవరు పూరించిన కథ బాగుందని ఎక్కువ వ్యాఖ్యానాలు వస్తాయో, వారి కథను ఉత్తమంగా నిర్ణయించి, పబ్లిష్ చేయడం జరుగుతుంది.

మీకు నా ఆలోచన మంచిదనిపిస్తే అభినందించండి. ఇదేం వెర్రి అనుకంటే అలా విశ్రమించకండి.

పుర్రెకో బుద్ధి అన్నారు ఆర్యులు..


మీకు నచ్చని ఈ ఆలోచన మరొకరికి నచ్చవచ్చు. వారు ఎంతో ఉత్సాహంతో పాల్గొనవచ్చు.

వచ్చిన ప్రతిస్పందనలపై ఆధారపడి ఈ ప్రక్రియను ప్రారంభించాలా, వద్దా అనేది నిర్ణయిస్తాను..

మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తూ…