Saturday, March 1, 2008

అప్పుడుగానీ తెలియదు...


ఎంత కాదనుకున్నా.. ఎంత నచ్చజెప్పుకున్నా..ఎప్పటికప్పుడు మళ్లీ మళ్లీ అనిపిస్తూనే ఉంటుంది.. నేనూ అదే దారిలో నడుస్తున్నానని..వ్యక్తిగతంగా జీవితంలో ఎన్ని శిఖరాలను అధిరోహించినా (?)మనిషిగా పాతాళపు అంచులను చేరుకుంటున్నానని..

నా డైరీలో మంచి పనులకు మాత్రం ఎప్పుడూ వాయిదాలే..అలాగని చెడ్డ పనులు చేస్తున్నానని కాదు..ఎప్పటికప్పుడు రేపు అయినా చేయాలనే ‘ఎస్కేపిజం‘ తప్ప..ఇవాళ ఎందుకు చేయకూడదు, చేయలేము అనే భావనే రాదు కదా..

తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని శతకకారుడు, ఇంకా సదా నా పక్కనే ఉండే రాజుగారు చెబుతున్నప్పటికీ..అనుభవమైతే గానీ తెలియదు.. తప్పించుకు తిరగడం ఎంత కష్టమో..ఆత్మారాముడి నుండి..

1 comments:

శోభ said...

నాయనా మాధవా…

నీ భావావేశానికి నా జోహార్లు నాయనా…. నీ ఆత్మారామున్ని శాంతించమని చెప్పు. నువ్వు మనిషిగా ఎన్ని అద్భుతాలను సాధించగలవో, సాధిస్తావో నాకు తెలుసు.

నిన్ను నిన్ను తక్కువగా చూడకు నాయనా… నువ్వు మాధవుడివి. అందరికీ అభయమిచ్చేది నువ్వే. నడిపించేది నువ్వే… అది గుర్తు పెట్టుకో….

ప్రేమతో...

పిన్ని.