Tuesday, April 14, 2009

నాకు తెలుసు..!


నాపై నీ అలక,
ఎడారిలో ఎండమావి అని నాకు తెలుసు..
ఎక్కడో గానీ ఉండదు,
కొండొకచో ఉన్నా ఎంతో కాలం నిలవదు…

కాదు కానేరదు,

నాపై నీ అలక,
నీ మనస్సు మందిరంలోని
నల్లరాతి శిల్పం అంటావా..

నా గుండె గదుల్లో
ప్రతిధ్వనించే ఆవేదన
దాని చెవులకు సోకనివ్వు..

అంత కఠిన పాషాణమూ
కరిగి అనుమతిస్తేనే
కడసారి చూపులకు
తరలిరా ప్రియతమా!!

Sunday, April 12, 2009

బాల్యమా.. నీవెక్కడ..?

మొన్నటి కథ…!

sreecharitham_1

బాల్యం అంటే…
వెచ్చటి అమ్మ కౌగిలిలో ఆదమరిచి నిద్రపోవడం,
‘అఆ’లు దిద్దించే నాన్నను చూసి దాక్కోవడం,
అక్కలతో, అన్నలతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం,
ఎగిరే గాలిపటాలను చూస్తూ ఊహల్లో విహరించడం,
బడి ఎగ్గొట్టేందుకు వాన కోసం దేవుడిని ప్రార్థించడం,
దండించిన మాస్టారు సైకిల్ టైర్‌లో గాలి తీసేయడం,
సాయంకాలాలు బంతాటలు,
రాత్రుళ్లు దాగుడుమూతలు,
పక్క మీదకి చేరాక ముసలమ్మల కాశీ మజిలీ కథలు..

బాల్యం అంటే…
ఒక సరదా.. మళ్లీ మళ్లీ తిరిగి వస్తే బాగుండునని
ప్రతి ఒక్కరు తపించే, ఆశించే
ఓ మధురమైన, అందమైన
మరిచిపోలేని ఓ అద్భుతమైన కల.

మరి నిన్నటి పరిస్థితి…!

sreecharitham_2

బాల్యం అంటే…
బండెడు హోమ్ వర్క్,
స్పెషల్ క్లాసుల పర్వం,
తోటి పిల్లలతో ప్రోగ్రెస్ కార్డుల పోటీ,
ఉదయాన్నే కాళ్లీడ్చుకుంటూ ట్యూషన్లు,
సాయంకాలాలు కంప్యూటరు క్లాసులు,
డాన్సు క్లాసులు, యోగాభ్యాసాలు,
రాత్రుళ్లు ఆన్‌లైన్ కోచింగులు,
కాన్వెంట్ కుర్రాళ్లకు ఐఐటి టార్గెట్లు..

బాల్యం అంటే…
ఒక బాధ.. ఒక వ్యథ
నిద్రలో సైతం
ఉలికిపాటుకు గురిచేసే
ఓ పీడకల.

ఇక..

నేటి (దు)స్థితి…!

sreecharitham_3

బాల్యం అంటే..
జిహాద్ పాఠాలు,
తుపాకీ గుళ్లు, సైనేడ్ బిళ్లలు..
ఆత్మాహుతి సైనికులు,
మత మౌఢ్యంలో కొట్టుమిట్లాడే
రాక్షసుల చేతుల్లో
ఊపిరి పోసుకునే మారణాయుధాలు,
ఉగ్రవాద రక్కసి కోరల్లో
ఆహుతవుతున్న చిన్నారులు..

నేటి బాలలు….
పసిమొగ్గ ప్రాయంలోనే
వాడిపోతున్న గులాబీలు..

మరి రేపు (?!?!?)….

(http://telugu.webdunia.com/miscellaneous/kidsworldకు స్పందన)

Sunday, April 5, 2009

శైవక్షేత్రంలో కాంగీయుల తిరుగుబాటు..



చిత్తూరు జిల్లాలో అదొక చిన్న అసెంబ్లీ నియోజకవర్గం.

అక్కడ దాదాపు ఇరవయ్యేళ్లుగా నిరవధికంగా తెదేపా అభ్యర్థినే విజయం వరిస్తుండేది. అతని బలమైన సామాజిక వర్గంతో పాటు, చంద్రబాబుతో ఉన్న అత్యంత సాన్నిహిత్యం మూలంగా అతను గెలిస్తే క్యాబినెట్ మంత్రి కూడా అవుతాడు కనుక, తద్వారా మరిన్ని ‘ప్రయో’జనాలను పొందవచ్చు కనుక ప్రజలు గుడ్డిగా అతడికే ఓట్లు గుద్దేవారు.

కానీ, ఆ పెద్దాయన సంవత్సరంలో 300 రోజులూ భాగ్యనగరంలో తిష్ట వేసి, ఇక్కడి ప్రజల గోడును పట్టించుకునేవాడు కాదు. ఆ ఊరిలో అతన్ని ఓడించే సత్తా మరొక ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌కు లేకపోయింది. మనోడికి ఎదురులేకపోయింది. ఆటోమేటిక్‌గా కళ్లు అతని బట్టతలపైనెక్కి కూర్చున్నాయి.

అదే తేదేపాలో మరొక బలమైన సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుండేవాడు. ఆర్థికంగానూ బలమైనవాడు కావడంతో పార్టీలో చేరిన కొన్ని రోజుల్లోనే రాష్ట్రస్థాయి నేతగా ఎదిగాడు. ఓ శుభముహూర్తాన పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడ్డాడు. ఖేల్ ఖతం.. జెండా, కండువా రెండూ మార్చేశాడు. అతగాడి వైఖరితో మొహం మొత్తిన జనం ఇతనికి పట్టం కట్టారు.

ఇదంతా ఎందుకంటే -

కాంగ్రెస్ పార్టీలో అన్ని సంవత్సరాలుగా ఉన్నవారెవ్వరూ అతనిపై గెలవలేకపోయారు.
జిల్లాలో ఏ చిన్న పదవిని అనుభవించలేకపోయారు.
రాబడి, పరపతి రెండూ లేకపోవడంతో ఇతనికి జైకొట్టేసారు.

తిరుగుబాటు నాయకునికి అధికారం చేజిక్కగానే, అందరినీ చక్కగానే గమనించాడు. పదవ తరగతి తప్పి, పొట్టకూటి కోసం కేబుల్ వైర్లు చుట్టుకునే ఓ స్థానిక ‘నేతన్న’కు ఆ ఊరి గుడిని రాసిచ్చేసాడు. తన స్వంత లోకల్ ఛానెల్‌లో అతి శ్రద్ధాభక్తులతో పదవులు నిర్వర్తించిన మరొక ముఖ్యడికి పార్టీ పదవిని కానుకిచ్చేసాడు. అయినవారికి అందరికీ తాను తినగా మిగిలినది అంతో ఇంతో విదిల్చేవాడు.

కథ సాఫీగా జరిగితే ఇక వింతేముంది..

ఎదిగేకొద్దీ ఒదగమని పెద్దలు చెప్పారు గానీ, అది రాజకీయాల్లో పనికిరాదుగా. అడ్డమొచ్చినవాడిని, ముందున్నవాడినీ తొక్కుకుంటూ, తన్నుకుంటూ దూసుకెళ్లిపోకుంటే వెనుకే ఉండిపోతారు మరి. కాసింత పలుకుబడి రాగానే, కేబుల్ వైర్లోడికి ఆశ పుట్టింది. గుడికి వచ్చే కొందరు పెద్దలతో తెర వెనుక రాజకీయాలు నెరిపి, వారసత్వాలకు పెట్టింది పేరు అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రంలో శక్తివంతమైన యువనేతగా ఎదిగిన ఓ పత్రికాధిపతి(??)కి దగ్గరైపోయాడు.

ఇంతటికీ కారణం ఆ గుడి, ఈ తిరుగుబాటు ఎమ్మెల్యే పెట్టిన ఛైర్మన్‌గిరీ అనే భిక్ష.

అంతే ఇక చూస్కోండి.. నేను సైతం అంటూ టిక్కెట్ కోసం ఎగబడ్డాడు. ఇతనికి తోడు ఓ బేరాల్లేని డాక్టరు. గతంలో వీరిద్దరూ ఆ గుడి పదవి కోసం పోటీ పడ్డారు, దాదాపు వీధి పోరాటలకూ దిగారు. గుడి పదవే దక్కని ఆ పెద్ద డాక్టరు, ఏకంగా ఎమ్మెల్యే టిక్కెట్‌నే ఆశిస్తున్నాడు ఇప్పుడు. అతను, ఇతను ఏకమైపోయి ప్రస్తుత ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు, ధర్నాలు, సమావేశాలు నిర్వహించేస్తూ ఓట్లను చీల్చి, ఉన్నది కాస్తా ఊడగొట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

కొసమెరుపు:
స్థానిక డిగ్రీ కళాశాలలో జరిగిన ఎన్నికల్లో గెలుపు కోసం వీరపాట్లు పడిన ఔత్సాహిక యువనేత ఒకరున్నారు. ఇతగాడి పుణ్యమా అని, అప్పటి నుంచి ఆ కాలేజీలో ఎన్నికలే బందైపోయాయి. ఇప్పటికి కూడా.. చాన్నాళ్ల క్రితమే పొట్టకూటి కోసం కర్ణాటకలో సెటిలైపోయిన ఆ పెద్దమనిషి ఇప్పుడు మళ్లీ స్వంత ఊరిలో పార్టీ అభి’వృద్ధి’ పనులు చేపట్టేస్తూ, సంక్షేమ కార్యక్రమాలకు, పీడిత తాడిత, అణగారిన వర్గాలకు దగ్గరైపోతున్నాననే భ్రమలో కొట్టుకుంటున్నాడు. ఈయన కూడా కాంగీయుడే. టిక్కెట్ కోసం ముచ్చటపడుతున్నవాడే. ఈయన అభిమానులెవరో, ఎంతమందో తెలియదుగానీ, వారి కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటించేసాడు.

ఇవన్నీ చూడబోతే, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఓడించడానికి గతంలో ఓడిపోయిన తెదేపా పెద్ద మనిషే తెర వెనుక ఉండి వీళ్లని పురికొల్పుతున్నాడని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు..

మరి మీరు??!

పిల్లలు దేవుడు చల్లనివారే..



పిల్లలు చల్లనివారేనా.. అంతేనా.. మరేమీ కాదా అని ప్రశ్నిస్తే మనలో చాలా మంది తెల్లబోతారు…

ఎందుకు కారు, పిల్లలు గడుగ్గాయిలు, చిచ్చర పిడుగులు, సందేహ ప్రాణులు.

వాళ్లు అడిగే చిన్న చిన్న ప్రశ్నలకు, ఆ క్షణంలో వారి నుండి తప్పించుకునేందుకు ఏవో సమాధానాలు చెప్పి దాటవేస్తాం గానీ, లోతుగా ఆలోచించుకుంటూ పోతే మహా మహా వేదాంతులకు, పండితులకే అంతుపట్టని విశ్వ రహస్యాలుంటాయి.

ఆ రోజు ఆదివారం. ఇల్లు సందడిగా ఉంది. మా అక్క, బావ పిల్లలతో మా ఇంటికి వచ్చారు. ఇక్కడికే కాదు, ఎక్కడికి వెళ్లినా మా అక్క టీవి సీరియల్‌లు వదలదు, మా బావ పట్టుకున్న పేపర్ వదలడు. మా కోడలు, అల్లుడి ఆటలకు ఎక్కడా కొదువ లేదు. వాళ్లు ఒక్కో ఏరియాలో ఒక్కో బ్యాచ్‌ను మెయింటైన్ చేస్తుంటారు.

కోడలు బుద్ధిమంతురాలే, మేడ మీదో, వరండాలోనో బొమ్మలు పెట్టేసుకుని ఆడేసుకుంటుంది. మా అల్లుడు బబ్లూగారితోనే సమస్యలన్నీ. బ్యాట్ ఎత్తుకుని రోడ్డు మీద పడితే, బాల్‌ను కొట్టకుండా వాడితో పాటు ఆడే పిల్లల్ని కొట్టేస్తుంటాడు. మా అన్నగారు గతంలో అక్కడ టీచర్ గిరీ వెలగబెట్టారు కాబట్టి… చుట్టుపక్కల పిల్లలు ఆయన భయంతో వీడినేమి అనరు, అనలేరు.

కొండొకచో అన్నా వీడు అంతకు రెండింతలు అనకుండా ఊరుకోడు. అలాంటి ప్రతాపాలు నేనో, మా అన్నో చూసినా తుర్రుమంటూ పోయి అమ్మ కొంగు చాటున దాక్కుంటాడు - బుద్ధిమంతుడిలా. ఆ కొంగు వాళ్లమ్మదైతే ఫర్లేదు, మా అమ్మది.

అప్పటికీ కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో వాడిని ఏమైనా అన్నామంటే, మా అమ్మ మా భరతం పట్టేస్తుంది.

ఒకసారి నేనే బలైపోయా వాడి తెలివితేటలకి. వెంటపడి ఓ దెబ్బ వేసానో లేదో ఎప్పట్లానే మా అమ్మనాశ్రయించాడు. వాడి తరపు ఈవిడ వకాల్తా.

మా అమ్మకో ఊత పదం ఉంది. “పోనీలేరా.. వాడి పాపాన వాడే పోతాడు. దేవుడు అన్నీ చూస్తుంటాడు” అని.

భాగస్వామ్య వ్యాపారం పేరుతో స్నేహితుడు నాకు శఠగోపం పెట్టినప్పుడు ఇదే మాట. అవసరానికి డబ్బు తీసుకున్న బంధువులు మొత్తానికి నామం పెట్టినప్పుడు అదే మాట. “పోనీలేరా.. వాడి పాపాన వాడే పోతాడు. దేవుడు అన్నీ చూస్తుంటాడు” అని.

మా వాడేదో ఏడుస్తున్నాడు కదాని ఊరడింపుగా ఇదే వాక్యాన్ని ఉపయోగించేసింది. ఆ తర్వాత ఆమెకు తీరిగ్గా నాలుక్కరుచుకునే అవకాశాన్ని వాడు ఇచ్చేసాడు.

అయితే అమ్మమ్మా.. దేవుడు అన్నీ చూస్తుంటాడా

అవును..

అంటే ఇప్పుడు చిన్న మామయ్య నన్ను కొట్టింది

అది కూడా..

మరి.. రెండ్రోజుల ముందు మా ఊరిలో నేను వంశీగాడిని కొట్టింది కూడా చూసాడంటావా

ఒక్క క్షణం ఖంగుతిన్న ఆవిడ అంతలోనే తేరుకుని - ఖచ్చితంగా చూసే ఉంటాడు అంది.

దేవుడు ఒక్కడే కదా.. అక్కడ, ఇక్కడ.. ఎంతమందిని చూస్తాడు.

అంతలోనే కలగజేసుకున్న మా అక్క వాడిని గద్దించడం, వాడు మళ్లీ వీధిలోకి తుర్రుమనడం జరిగిపోయాయి.

ప్రతి రోజూ నిద్రపోయే ముందు ఆ రోజు జరిగిన సంగతులను, సంఘటనలను సింహావలోకనం చేసుకోవడం నాకు పరిపాటి. వాటిలో ఎక్కువ భాగం సంతోషం కలిగించే సంఘటనలే ఉంటాయి. అందులో మా అల్లుడికి నా పక్కన పడుకుంటే గానీ నిద్ర రాదు. నేను వాళ్ల ఊరు వెళ్లినా, వాడు ఇక్కడికి వచ్చినా మా పడకలు పక్క పక్కన ఉండాల్సిందే. క్రమంగా నాకూ అలవాటైపోయింది.

ఆడి ఆడి అలసిపోయాడేమో, ఎక్కువసేపు కబుర్లాడకుండానే నిద్రలోకి జారుకున్నాడు.

వాడిని చూస్తుంటే నాకు నా బాల్యం గుర్తుకొస్తుంది. బాల్యంలో మేము కోల్పోయిన కొన్ని ఆనందాలను వెతికి పట్టుకుని మరీ వాళ్ల చేతికందిస్తుంటే అవన్నీ మేమే అనుభవిస్తున్నట్లు, మేము మళ్లీ చిన్నపిల్లలమైపోయినట్లు ఉంటుంది. నిద్రపోయేటప్పుడు పిల్లల్ని అదే పనిగా చూస్తుంటే వాళ్లకి దిష్టి తగులుతుందని వాళ్లు పుట్టినప్పటి నుండి అమ్మ వారిస్తూనే ఉంటుంది. పువ్వులను, పిల్లలను చూడకుండా ఎలా ఉంటాం..?

హఠాత్తుగా మా అమ్మతో వాడి వాదన గుర్తుకొచ్చింది.

నిజంగా దేవుడు అన్నీ చూస్తుంటాడా? దేవుడు ఒక్కడే కదా. మరి జనాభా సంఖ్య… రోజురోజుకీ పెరిగిపోతోంది. ఎవడి శక్తిమేరకు వాడు పాపాల చిట్టాను పెంచుకుంటున్నారు. పాతిక మందికి మించని తరగతి గదిలో పిల్లల అల్లరినే మాస్టర్లు భరించలేరే. ఇన్ని వేల కోట్ల ప్రజల పుణ్యాలు, పాపాలు, మంచి, చెడు, కోరికలు, కన్నీళ్లు, … ఎన్నని చూస్తాడు దేవుడు.

మధ్యలో పుట్టించడం, చంపడం వంటి అదనపు పని ఒత్తిడి ఉండనే ఉంది. ఏమైపోతాడు దేవుడు? మన కష్టాల గురించి ఆయనకి చెప్పుకుంటాం. మరి ఆయన కష్టాలు ఎవరితో చెప్పుకుంటాడు? మన మేనేజర్‌కి పైన మరొక మేనేజర్ ఉండే విధంగా, మన దేవుడికి ఆయన లోకంలో మరొక దేవుడుంటాడా? ఈయనకి అసలు విశ్రాంతే ఉండదా? భార్యా పిల్లలు, సంసారం ఉండవా?

ఆఫీస్‌లో రెండు మూడు గంటలు ఎక్కువ పని చేయాల్సి వస్తే మన మొహంలో రంగులు మారిపోతుంటాయే.. ఈయన సంగతేంటి?

అంతలోనే మరో సందేహం….

అసలు ఇంతకీ దేవుడున్నాడా? ఉన్నాడని మనం అనుకుంటున్నామా?

అలా అనుకుంటున్నానో లేదో, ఇలా మా అల్లుడుగారు తన ఎడమకాలితో చాచిపెట్టి డొక్కలో తన్నారు - నిద్రలోనే. దెబ్బకు దేవుడు దిగివచ్చాడు. అంతూపొంతూలేని ఆలోచనలతో హిమాలయ అంచులకు వెళ్లిపోతున్న నన్ను ఒక్క తన్నుతో మళ్లీ నా గదిలోకి తోసేశాడు. వాడిని సరిగ్గా పడుకోబెట్టి నేనూ నిద్రపోయాను, దేవుడికి దండం పెట్టుకుని…!!

నేనూ.. మధూ.. చిన్నా!!


“ఈ రోజూ గొడవ పడ్డారేమో”

నాలో నేననుకున్నానో, పైకే అనేసానో. అప్పటికే యుద్ధం ముగిసినట్లుంది. ఇల్లంతా భరించలేనంత నిశ్శబ్దం. ఎవరి పనుల్లో వారు ఉన్నారు - నిశ్శబ్దంగానే, చప్పుడు చేయకుండా, కనురెప్పలు కదిలినా వినిపిస్తుందనుకున్నాడేమో మా అబ్బాయి కళ్లార్పకుండా వీక్లీలోని అక్షరాలను తరుముతున్నాడు. వాడి ఆలోచనలు ఎక్కడున్నాయో గానీ, తల అయితే పుస్తకంలోనే ఉంది.

మా ఆవిడ.

తెలిసిన విషయమే.

తను ఎవరితో గొడవ పడినా వంట గదిలోని పాత్రలతో మాట్లాడేస్తుంటుంది. కాలికి తగిలే పీటపై చిటపటలాడుతుంది. చీపురును ఛీ ఛీ అంటుంది. నీకు బుద్ధిలేదు అని నా కారుపై విరుచుకు పడుతుంది.

అలవాటైపోయిన విషయాలే ఇవన్నీ.

అయితే అంతుపట్టని విషయమల్లా, ప్రస్తుత సమస్య ఏమిటనే.

నాకు నేనుగా వాళ్ల వ్యవహారాల్లో వేలు పెట్టడం మానేసాను. ఎవరి అభిమానాలు వారికుంటాయిగా. నేనూ మినహాయింపును కాదు. భార్యాపిల్లల విషయాల్లో అభిమానాలు, ఆత్మాభిమానాలు ఏంటయ్యా అని మీరు అనుకోవచ్చు. గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా నేను ఉచిత సలహాలు ఇవ్వడం, మధ్యస్థాలు చేయడం మానుకున్నాను.

ఉరుము ఉరిమి ఉరిమి మంగళంపై పడ్డట్లు వాళ్లిద్దరూ కలిసి నాతో చెడుగుడు ఆడేస్తారు. అబ్బాయి అలా తయారైనదానికి నేనే కారణమంటుంది భార్యామణి. నన్నే విషయంలోనూ సపోర్ట్ చేయరే అని మూతి ముడుచుకుంటాడు నా ముద్దుల కొడుకు.

ఇక ఈరోజు భోజన కార్యక్రమానికి సెలవు ప్రకటించేసినట్లే. వీరిద్దరి తగవుల పుణ్యమేమో గానీ, ఏకాదశి, అమావాస్యలకే కాకుండా ఇలాంటి అకాల ఉపవాసాలకు అలవాటు పడిపోయాను. కాసిని మంచినీళ్లు తాగి, సిస్టమ్ ముందు సెటిలైపోయాను. పర్సనల్ మెయిళ్లు ఏవైనా వచ్చాయేమోనని చెక్ చేసుకోవడానికి. అంత ముఖ్యమైనవి ఏవీ లేవు, మా అబ్బాయి కాన్వెంట్ అడ్మినిస్ట్రేటర్ నుండి తప్ప. ఈ ఇ-మెయిలే అమ్మా కొడుకుల గొడవకు మూలకారణమై ఉండవచ్చు.

అయినా మనవాడి ప్రోగ్రెస్ కార్డు, బిహేవియర్, కాండక్ట్ గురించి ఎప్పుడూ చింతించాల్సిన అవసరం లేదు, ఈసారేమైనా తిరకాసు జరిగిందా చెప్మా అనుకుంటూనే మెయిల్ ఓపెన్ చేసాను. తీరా చూస్తే, మా వాడి స్కూల్లో డార్జిలింగ్‌కు టూర్ ప్లాన్ చేస్తున్నారట. ఆసక్తి గల పిల్లలు పేర్లు నమోదు చేసుకోండి అంటున్నారు.

మా మధుకి కొడుకును ఒంటరిగా అంతంత దూరం పంపడం సుతారమూ నచ్చదు. తోటి పిల్లలు, టీచర్లు తోడు ఉంటారుగా అంటే వినదు. ఈ విషయంలో తను ఇప్పటివరకు రాజీ పడలేదు, ఇకపై రాజీ పడుతుందన్న నమ్మకమూ నాకు లేదు. మా వాడిపై తనకుండే ప్రేమ అలాంటిది.

కన్న తండ్రినైన నన్నే ఓ మాట కూడా అననీయదు. వాడినిక ఎవరూ ఏమీ అనరు. అలాగని అతి గారాబంతో వాడినేమీ పాడు చేయట్లేదు. తాను ఓవైపు ఆఫీస్ పనులు చూసుకుంటూనే, వాడి చదువు, ఆరోగ్యం విషయాల్లోనూ ఎంతో శ్రద్ధగా ఉంటుంది. నేను ఈ మాత్రం నిశ్చింతగా ఉన్నానంటే అందుక్కారణం నా మధు.

వాడికి ఎన్నో విషయాల్లో సపోర్టుగా ఉండే తను ఇందులో మాత్రం బద్ధ శత్రువు అయిపోతుంది. వాడికి అసలు బైట ప్రపంచమే తెలియదు. వాడి పుట్టినరోజుకి సకుటుంబ సపరివారంగా వెళ్లే తిరుమల తప్ప. బంధువుల ఇళ్లకు వెళ్లినా, వాడి స్కూల్, మా ఇద్దరి ఆఫీసుల పేర్లు చెప్పి ముచ్చటగా మూడు రోజులైనా గడిపింది లేదు. సమ్మర్‌లోనూ వాడిని ఒంటరిగా వాళ్ల మేనత్త వాళ్లింటికీ పంపదు. మా అక్కయ్య కూడా అప్పుడప్పుడు చాటుగా బాధ పడుతుంటుంది.

నా ఆలోచనల్లో నేనుండగానే అమ్మా కొడుకులిద్దరూ నా గదిలోకి దూరారు.

“విషయం తెలిసిందిగా మీకు.” ఉపోద్ఘాతాలు కూడా అనవసరం కాబోలు.

“ఊ”

“మీ అబ్బాయి ఈ సంవత్సరం మరీ పట్టుబడుతున్నాడు, డార్జిలింగ్‌కు వెళ్లి తీరాల్సిందేనట” వాళ్లు కొట్టుకున్నప్పుడు మాత్రం వాడు నా కొడుకైపోతాడు ఈవిడకి. మిగతా సందర్భాల్లో నెత్తిన పెట్టుకొని ఉంటుంది.

మధ్యలోనే మా వాడు అందుకున్నాడు..

“నా ఫ్రెండ్స్ అందరూ వెళుతున్నారు నాన్నా.. నా కంటే చిన్నవాళ్లు కూడా.. ఇంతవరకు నేనే ఊరికి వెళ్లలేదు. నా ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా సెలవుల్లో ఊటీ, ఢిల్లీ వెళ్లి వస్తుంటారు తెలుసా. నాకు మాత్రం అమ్మమ్మ, నాన్నమ్మ ఊర్లు తప్పితే ఏమీ తెలియదు. నేను డార్జిలింగ్ చూడాల్సిందేనంటే అమ్మ ఒప్పుకోనంటోంది” ఇంగ్లీష్ మీడియం చదువులైనా అమ్మా నాన్న సంస్కృతే మధుకి, ఆ మాటకొస్తే నాకు ఇష్టం. మమ్మీ డాడీలను గుమ్మం తొక్కనివ్వలేదు.

“చివరి తేదీ ఎప్పుడు” అడిగాను

వాడి మొహంలో ఒక్కసారిగా వెలుగు - “ఎల్లుండే” ఠకీమని జవాబు

మధు మొహం ఎలా ఉంటుందో నేనూహించగలను - అందుకే చూడలేదు.

“రేపు ఉదయాన చెప్తాను గానీ, నువ్వు వెళ్లి చదువుకో” అన్నాను. మరొక మాటకు అవకాశం లేకుండా, ఇంకాస్సేపు అక్కడ ఉంటే ఏమైపోతుందోనన్నట్లు వాడు వెంటనే వెళ్లిపోయాడు.

”మధూ”

ఆ వైపు నుంచి జవాబు లేదు..

”పిల్లలకు బయట ప్రపంచం తెలియడం అవసరం కదా. వాడి ఫ్రెండ్స్ అంతా టూర్ వెళ్లి వచ్చి, అక్కడి వింతలు, విశేషాలు చెబుతుంటే, మనవాడు బిక్కమొహం వేసుకుని వినాల్సి వస్తుంది. నా చిన్నతనంలో అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి కూడా. మన అబ్బాయి అలా బాధపడటం అవసరమా చెప్పు..”

మీరు, మీ అబ్బాయి మంచివాళ్లే. అయితే నేనేనా మీ ఆనందానికి అడ్డు వచ్చేది అంటూ ముక్కు చీదలేదు తను. నా గురించి నాకంటే, తనకే బాగా తెలుసు.

“అక్కడ ఎలాగుంటుందో ఏమిటో, అంతమంది పిల్లల్లో మన చిన్నా గురించి ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. అందులోనూ ఇప్పటి వరకు వాడిని వదిలి వారం కాదు కదా, ఒక్క రోజూ ఉండలేదే. మీరే చెప్పండి - నిద్ర లేచి వాడిని చూడకుండా మీరు మరొక పని చేస్తారా, చేసారా?”

నిలదీసినట్లు కాకుండా, నెమ్మదిగానే అడిగింది. నిజమే. ఆలోచించాల్సిన విషయమే అనిపించింది నాక్కూడా. నెమ్మదిగా వెళ్లి చిన్నాగాడి గది తలుపు తట్టాను. మేల్కొన్నట్లే ఉన్నాడు.

”నువ్వు ఫ్రెండ్స్ కోసం వెళ్తానంటున్నావా, డార్జిలింగ్ చూడాలని ఉందా”

”డార్జిలింగ్ చూడాలని ఉంది, అంతే”

”సరే”నని నా గదికి వచ్చేసాను.

మధు మా మాటలు వింటూనే ఉంది.

”చిన్నా డార్జిలింగ్ చూడాల్సిందేనంటున్నాడు. వాడి కోరికలోనూ న్యాయం లేకపోలేదు మధూ. వాడికి డార్జిలింగ్ చూడాలని ఉంది, నీకు వాడిని ఒంటరిగా పంపడం ఇష్టం లేదు. ఓ పని చేద్దాం. వాడితో పాటు మనమూ వెళ్దాం. స్కూల్ బస్‌లో కాదులే, మన కార్‌లోనే.. ఏవంటావ్” అన్నాను.

”బడ్జెట్..?” ఆర్థిక మంత్రి అవతారం ఎత్తింది.

“ఫర్లేదులేవోయ్.. నేను చూసుకుంటాలే”

ఈయనేనా ఈ మాటలంటోంది..

ఇంకా అపనమ్మకమే తన కళ్లల్లో.. అనవసర ఖర్చులకు ఆమడ దూరం నేను. ఆశ్చర్యంగా చూస్తూనే నిద్రకు ఉపక్రమించింది తను.

”ఇది అనవసరమైన ఖర్చు కాదు మధూ.. నా బిడ్డ కోరిక తీర్చడం నాకు అనవసరం అవుతుందా చెప్పు..”

నేను నడుము వాల్చాను.. సంతృప్తిగా..

నిజమే.. ఆనందంగా ఉన్నది నేను ఒక్కడినే కాదు..

నా పక్కన పడుకున్న నా మధు, తలుపు చాటున నిలుచున్న మా చిన్నా కూడా..

ఆనందంగా ఉన్నావా?



ఈ మధ్యనే చాలా రోజుల తర్వాత మా ఊరికి వెళ్లాను.

సాధారణంగా మా ఇంట్లో చుట్టాలు, ఇరుగుపొరుగుల సందడి ఎక్కువ. అందులో మనం (!!) వెళ్లేసరికి, విషయం తెలిసినవారు వచ్చి పరామర్శించి పోతుంటారు. కొందరితో తప్పనిసరై మాట్లాడాల్సి వస్తే (అంటే చెప్పిందే చెప్పి, అడిగిందే అడిగే టైమ్ పాస్ శాల్తీలన్నమాట), చాలా మందితో ఇష్టంగా మాట్లాడేస్తుంటాను.

అసలు నా గొంతులోనే ఏదో తెలీని శక్తి ఉంటుంది అని మా పిన్నమ్మ అంటే, ఆ మాత్రం తెలియదా - ఆ తెలియని, కనిపించని శక్తి పేరే “ప్రేమ” అని మా అత్తమ్మ అంటూ ఉంటుంది.

ఏంటీ ‘శ్రీచరితం’లోనూ ఈ ఆత్మ స్తుతి (సుత్తి) అనుకుంటున్నారా?

సరే అయితే..

ఆ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది.
ఎప్పుడో గానీ కనిపించని మా నాన్న ప్రియ మిత్రుడు, మేమందరం ఇష్టపడే మా పార్థసారథి మావయ్య మా ఇంటికి వచ్చారు. మా నాన్న సమకాలీనుడు, సహోద్యోగి. సుఖాల్లోనే తోడుండే కొందరిలా కాకుండా, మా కష్టాల్లోనూ ఆయన మా వెంట ఉన్నారు. ఏమాత్రం కల్మషం, స్వలాభాపేక్ష లేని మనిషి.

“బాగున్నావా బాబూ..”
వృద్ధాప్యం వల్ల కాబోలు, గొంతు కొంచెం కంపిస్తోంది.
“బాగున్నా మావయ్యా.. మీరు..”
“బాగున్నానంటే..”
అయితే ఈ అలవాటు ఇంకా పోలేదన్నమాట.. ఎదుటి మనిషి చెప్పేది పూర్తి కాకుండానే మరో ప్రశ్న తయారు…
“నాకేం మావయ్యా.. ఆనందంగా ఉన్నాను.”
“మరి నీపై ఆధారపడినవారు”
“అదేంటి కొత్తగా. నాపై ఆధారపడినవారు ఎవరన్నారు. నాలుగురాళ్లు సంపాదించేంత మాత్రాన కుటుంబమంతా నా మీదే ఆధారపడి ఉన్నారని నేననుకోవడం లేదు మావయ్యా.”
“సరే బాబూ.. నీతో కలిసి ఉన్నవారి సంగతి”
“నాతో కలిసి ఉన్నవారంటే?”
ప్రశ్నకు ప్రశ్నే జవాబుగా ఇచ్చేంత చనువు ఉంది నాకు. అప్పట్లో మా నాన్నకు నచ్చంది అదే. స్నేహితుడు చిన్నతనంగా అనుకుంటాడేమోనని ఈయనే అనుకునేసి, నా వాగ్ధాటికి అడ్డుపడేవాడు మా నాన్న.
“నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ స్నేహితులు, సహోద్యోగులు ఎవరైనా కావచ్చు.”
“అందరూ ఆనందంగా ఉన్నారు మావయ్యా.. ఇంతకీ మీ సంగతి ఏంటి?”
చురక అంటించాననుకున్నా.
“నీతో ఉన్నవారందరూ ఆనందంగా ఉన్నారా?”
“అందరూ ఆనందంగా ఉన్నారు”
“అందరునా?”
అసలేంటి ఈయన అనుకుంటూనే
“అందరూ మావయ్యా.. అందరూ ఆనందంగానే ఉన్నారు”
నా గొంతులో ధ్వనించిన ఒకింత అసహనాన్ని పసిగట్టారేమో.. ఆయన కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. మళ్లీ తేరుకున్నారు.

“అలా కాదు బాబూ.. మరి నువ్వు ఆనందంగా ఉన్నావా?”
“మావయ్యా.. నేను, నాతో ఉన్నవారు, నా స్నేహితులు, నా సన్నిహితులు, నా సహోద్యోగులు అందరూ బాగున్నారు మావయ్యా.. ఏమైంది, నీ విషయాలు చెప్పవేంటి, అత్తయ్య, మధు ఎలా ఉన్నారు?”
“వాళ్ల సంగతి తర్వాత బాబు. నీ గురించే నా ఆలోచన”
“అందరూ ఆనందంగా ఉంటే, నేను ఆనందంగా ఉన్నట్లేగా మావయ్యా.”

“కాదు బాబూ.. నువ్వు ఆనందంగా ఉన్నది నిజమై ఉండదు”
ఈయనేంటి మరిచిపోయేందుకు ప్రయత్నిస్తున్న తీపి జ్ఞాపకాలను పనిగట్టుకుని తవ్వేలా ఉన్నాడే.
“బాబూ.. నువ్వు ఆనందంగా ఉన్నాననుకుంటున్నావేమో.. ఒకసారి ఆలోచించి చూడు”
“ఇప్పుడా విషయాలన్నీ ఎందుకులే మావయ్యా.. ”
“ఏవో విషయాలు కాదు. ప్రస్తుత విషయాలే. నువ్వు ఆనందంగా ఉన్నావు అనుకుంటూ, నీ వారి కోసమో, నీతో కలిసి ఉన్నవారి కోసమో ఇప్పుడు నువ్వు అనుభూతించాల్సిన కొన్ని అనుభవాలను కోల్పోతున్నావురా. చూడు - నాకు తెలుసు కొన్ని కష్టాలు. నిరంతరం ఎవరో ఒకరి కోసం నీ సంతోషాలను, సరదాలను కట్టిపెట్టేసి, ఈ వయసులో అనుభవించాల్సిన కొన్ని సరదాలను కోల్పోతున్నావేమోరా. నేను, మీ నాన్న చేసిన తప్పులనే నువ్వు మళ్లీ చేస్తున్నావేమో.. ఆలోచించు బాబూ.”

బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. గుమ్మం దాకా వెళ్లి, మళ్లీ తిరిగి -

“ఒకటి గుర్తుంచుకో..
నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే, నీతో ఉన్న ప్రతి ఒక్కరినీ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆనందంగా ఉంచలేవు ; అలాగని వారంతా నీపై పగ పట్టారని నేను చెప్పను. నీ బాగు కోసమో, భవిష్యత్ కోసమో వారికి తోచిన సలహాలిస్తూ, నిన్ను, నీ ఆనందాన్ని పరిమితం చేస్తుంటారు. నీ ఆలోచనా దృక్పథం, ఆలోచనా సరళి వారికి అంతు పట్టకపోవచ్చు. బిడ్డ ఏమైపోతాడేమోనన్న బెంగ కావచ్చు.

అలాగే నీతోటివారందరినీ సంతృప్తిపరుస్తూ, ఆనందింపజేస్తున్నావంటే, నువ్వు కనీసం కొన్ని ఆనందాలనైనా కోల్పోతుంటావు.

గడిచిపోయిన కాలం తిరిగి రాదురా.
ఎంతకాలం బతుకుతామో తెలియదు. రెండు రోజుల తర్వాత ఎలా ఉంటామో తెలియదు.
మనకంటూ ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్రా.
దురలవాట్ల వెంటపడకుండా, నీ వయసులో నీకుండే చిన్న చిన్న సరదాలను తప్పకుండా అనుభవించు.
లేకుంటే,

పోలికల్లోనే కాదు, జీవన శైలిలోనూ నువ్వు మీ నాన్నవే అవుతావు!!”

పద ప్రయోగం


మెట్లు దిగుతూ కాలుజారి కిందపడిన స్నేహితుడికి విద్యుల్లేఖ..
కాలు విరిగిన కష్టాల్లో ఉన్నాడు కదాని కాసింత హాస్యం రంగరించి ఇలా సంధించాను

డడమే పనిగా పెట్టుకున్న పిల్లవాడా!
పద్ధతిగా పడ్డావా
పలకరింపులకే పడ్డావా - లేకుంటే
పరదా చాటునున్న పదారేళ్ల పడుచు
పకపకలకు పడ్డావా!!
పడినచోటే ఉన్నావా లేక
పరుగులెత్తి పారిపోయావా!!

“ప” పదాలతో పరిచిన
పద్యాన్ని చదివి
పకపకా నవ్వుతావా
పళ్లు కొరుకుతూ
పడగలెత్తి బుసలు కొడతావా!!

ఎక్స్‌ట్రాలొద్దమ్మా, ఒళ్లు జాగ్రత్త అంటూ పద్ధతిగా అవతలి వాళ్లు
హెచ్చరిస్తూ ఓ మెయిల్ పడేసారు..
మనం ఊరుకోం గదా! ఈ విధంగా ప్రత్యుత్తరం పంపేశాం..

దుగురి క్షేమం కోరే
పసిడి మనస్సు గల అన్నవు..
పవన పుత్రుడికి సరిజోడివి
పాశుపతాస్త్రధారివి నీవుండగా..

పాపం.. దరిచేరునా సాక్షాత్తూ
పది తలల పన్నగమైనా
పారునా.. ఏ నీచుని దుష్ట
పన్నాగమైనా

పొగిడానో, తిట్టానో తెలీని అయోమయంలో మిత్రుడు
ఇంకా తంటాలు పడుతూనే ఉన్నాడు..
పాపం..

“తాడేపల్లి” వ్యాఖ్యకు స్పందన

తాడేపల్లి Says:

కొంతమంది చేసే నేరాలకు టోకుగా మగజాతిని పేర్కొని నిందించడం నాటుగా అసహ్యంఉంది. అదే, ఆడవాళ్ళని నిందిస్తే sexism అంటారు. ఏం ? ఆ గౌరవానికి మగవాళ్ళు అర్హులు కారా ? ఆడముండలు అంటే ఎంత తప్పో మగమృగాలు అనడం అంతే తప్పు.

విషయం విశదంగా చెప్పడం కోసం గ్రామ్యం వాడాల్సి వచ్చింది. ఏమీ అనుకోవద్దు.

ఓ రాత్రి క్రిక్కిరిసిన బస్సులో ఇంటికెళుతున్నా. దారి మధ్యలో ఓ నడి వయస్సు స్త్రీ బస్సెక్కింది. అప్పటికే బస్సు నిండి ఉండటం, ఊతంగా బస్సులో ఉండే కమ్మీని సైతం అందుకోలేనంత పొట్టిగా ఉండటంతో “స్త్రీలు” అని వ్రాసి ఉన్న సీట్లలో కూర్చుని ఉన్న ఓ యువకుడిని సీటివ్వమంటూ బ్రతిమాలుకుంది.

అప్పుడా యువకుడు ఏమన్నాడో తెలుసా..
మీరు (ఆడవారు) మాత్రం పురుషుల సీట్లలో కూర్చోగా లేనిది, మేము ఆడాళ్ల సీట్లలో కూర్చుంటే ఏం? మా సీట్లలో కూర్చున్నప్పుడు మిమ్మల్ని లేవమంటే లేస్తారా? మేము మాత్రం మనుష్యులం కాదా? అంటూ ఆవిడపై మండిపడ్డాడు.

కొన్ని కొన్ని విషయాల్లో కొందరికే ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని కదా ఆర్యోక్తి. ఈ సృష్టిలో స్త్రీలకే పరిమితమైన కొన్ని శారీరక బలహీనతలు ఉన్నాయి, ఉంటాయి. ఇందులోనూ కొందరికి మినహాయింపు లభించవచ్చు. తక్కిన వాళ్లతో పోల్చితే, స్త్రీలను భారతీయులు బాగా గౌరవిస్తారని ప్రపంచ ప్రజల నమ్మకం. అలాంటి నమ్మకాలకు, విలువలకు తిలోదకాలిచ్చే ఇలాంటి వికృత చేష్టల మూలంగా యావద్భారతావని సభ్య సమాజం ముందు సిగ్గుతో తల వంచుకుంటోంది.

ఒక్క రాజకీయ నాయకుడు చేసిన తప్పుకు మొత్తం రాజకీయ వ్యవస్థను, లంచగొండియైన ఒక్క పోలీసు మూలంగా పోలీసు శాఖ మొత్తాన్ని మీరెప్పుడు విమర్శించలేదేమో నాకు తెలియదు. సగటు భారతీయునిగా, అందులోనూ ఆంధ్రునిగా మన రాష్ట్రంలో జరిగే ఇలాంటి అరాచకాలపై నేను గతంలోనూ స్పందించాను, ఇకపై కూడా స్పందిస్తాను.

ఇక మీరు ఉపయోగించిన గ్రామ్యం గురించి నేనేమీ బాధపడటం లేదు. సంస్కారంపై ఆధారపడి వ్యావహారిక భాష ఉంటుంది. మీకు మాత్రమే సాధ్యమయ్యే ‘సరళమైన’ భాషలో మీరు స్పందించినందుకు ధన్యవాదాలు. “ఆడముండలు” అనేటటువంటి పద ప్రయోగాన్ని నేనైతే ఉపయోగించలేను. ఎందుకంటే నాకు “అమ్మ” ఉంది.

మగ మృగాలు



ఇలాంటి దాడులు జరిగితేనే కదా -
మనబోంట్లకు (మీడియాకు) చేతి నిండా పని దొరికేది.
రాజకీయ నాయకుల మైకులు మరింత వేడెక్కేది.

ఇలాంటి దాడులు జరిగితేనే కదా -
చరిత్రను తవ్వుకునేందుకు అవకాశం దొరికేది.
మారిన ప్రభుత్వాల నడుమ దాడుల వ్యత్యాసాన్ని లెక్క కట్టేది.

ఇలాంటి దాడులు జరిగితేనే కదా -
సామాన్య జనం నుండి మేధావి వర్గం వరకు
కలాలకు, కులాలకు పట్టిన బూజు దులిపేది.

ఇలాంటి దాడులు జరిగితేనే కదా -
ఇలాంటి అభాగినులు ఉంటేనే కదా -
ఇలాంటి మగ మృగాలుంటేనే కదా -
ఆంధ్ర దేశాన్ని ఆంధ్ర దేశంగా గుర్తించేది!!

మరేమంటాం..
మరేమనగలం..
అంటే వింటారా?

(http://discussion.webdunia.com/Telugu చర్చావేదికకు స్పందన…)

అనంతం.. అసంపూర్ణం!

ఏంటి.. నిజమేనాఒక్క క్షణం ఏం వింటున్నానో కూడా అర్థం కాని అయోమయంలో పడిపోయాను..
నిజమేరామా మావయ్య సమాధానంలో ఏమాత్రం తేడా లేదు.
ఈయనేనా.. వరకట్నాలకు, భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఇతనేనా పైసా కట్నం అక్కర్లేదంటూ పేద యువతిని తన జీవితంలోకి ఆహ్వానించింది. ఇంత చేసిన ఈయనా రోజు ఇలాంటి పని చేసింది.
లోపలి నుండి మా అత్తమ్మ ఏడ్పులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.

నా దృష్టిలో ఎంతో ఉన్నతుడిగా ఉన్న మా మావయ్య ఒక్కసారిగా పురుగు కంటే హీనమైపోయాడు. మరొక్క క్షణం కూడా అక్కడ నిల్చోలేక, ఆయన వెనుక నుండి పిలుస్తున్నా పరుగులాంటి నడకతో నా గదికి వచ్చేసాను.

వరసకు మావయ్యే కానీ, మాది సోదర బంధాన్ని తలదన్నే ఆత్మీయ బంధం. మా మధ్య దాపరికాలు ఏమీ ఉండవు. వయస్సులో నాకంటే పెద్దవాడైనప్పటికీ, దాదాపు అన్నీ విషయాల్లోనూ నేను ఆయన సలహా తీసుకుంటూ ఉంటాను. అలాగే ఆయన కూడా. ఇద్దరం సాహిత్య ప్రియులమే. ఆయనకేమో చలం ఇష్టం. నాకు శ్రీశ్రీ అంటే అభిమానం. మా ఇద్దరి చర్చల్లో కుటుంబ విషయాల కంటే పుస్తకాలు, సాహితీ విలువల గురించిన ప్రస్తావనలే ఎక్కువ ఉంటాయి.

సహజంగానే మావయ్య అభ్యుదయవాది. చిన్నతనంలోనే ఊరి పెద్దలను ఎదిరించి సహపంక్తి భోజనాలను ప్రోత్సహించాడు. ()కారణంగా ఊరి నుంచి వెలి వేయబడ్డాడు. అందరికీ, అన్నింటికీ దూరమైనప్పటికీ తన అభిప్రాయాలను మాత్రం మార్చుకోని మా మావయ్యంటే చిన్నప్పటి నుంచి రకమైన భక్తితో కూడిన ఇష్టం నాకు.

అలాంటి మావయ్య రోజు మా అత్తమ్మకు అబార్షన్ చేయించాడంటే నేనే కాదు - మా మావయ్యతో పరిచయమున్న ఒక్కరూ నమ్మలేరు. కానీ, దురదృష్టవశాత్తూ అది నిజమే.

రకరకాల ఆలోచనలతోనే రెండ్రోజులు గడిచిపోయాయి. అసలు ఇలాంటి పనికి ఎందుకు పూనుకున్నాడో ఆయన్నే నేరుగా ()డిగేద్దామని బయల్దేరేంతలో ఆయనే నా గదికి వచ్చాడు. అయితే ఎప్పటిలా చిరునవ్వుతో కాదు.

అత్తమ్మ ఎలా ఉంది..” నా గొంతులో ఏదో లోపించినట్టు ఉంది.
ఏరా.. నా గురించి అడగవా..” ఆయన గొంతులో నిష్టూరం ఇసుమంతైనా లేదు.
నీకేంలే మావయ్యా. చెప్పేవి శ్రీరంగనీతులు అనే సామెతలాగా ….!” నా గొంతులో ఏదో అడ్డు పడింది. అక్కడితో ఆపేశాను.
ఏరా.. ఆపేసావేం. పూర్తి చెయ్యరా. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు కదూఆయన మాటలో ఇప్పటికీ అదే మార్దవం, నన్ను కదిలించేది అదే, కట్టిపడేసేది అదే.

ఏంటిది.. అప్పుడే చీకటి పడుతోందా. గదిలో అంతా మసక మసకగా ఉందేం..
.. కంట్లో పల్చటి నీటి పొర.
చటుక్కున గోడవైపు తిరిగాను.

ఏరా.. నా మొహం చూడటం కూడా ఇష్టం లేదా..”
ఎందుకిలా చేసావ్ మావయ్యా.. ఎందుకింతలా దిగజారిపోయావ్. ఆదర్శాలు, నీతులు ఊరి జనాలకేనా. అసలు అత్తయ్య మొహం ఎలా చూడగలుగుతున్నావ్ నువ్వు. ఎంతో కాలంగా పిల్లల కోసం ఎదురుచూసిందే.. నోచని నోము, ఎక్కని గుడి లేదే. తీరా ఆమె బిడ్డకు జన్మనివ్వబోతుంటే ఎందుకా బిడ్డను కడుపులోనే చంపేసావ్.. కేవలం ఆడపిల్లనేగా.. కట్నాలు, కానుకలు ఇచ్చుకోలేవనేగా.. ఏం.. మేమంతా చచ్చామనుకున్నావా?” ఆవేశం, ఏడుపు కలగలిపిన నా మాటలు నా గది గోడలకే విచిత్రంగా వినిపించాయేమో.
అయిపోయిందాఏంటసలు నాకర్థం కాకుండా ఉంది ఆయన తీరు. అదే స్థిరత్వం, ఎక్కడా తొట్రుపాటు లేకుండా..

రేయ్ మాధవా.. నిర్ణయం తీసుకోబోయే ముందు నేనెంత మథనపడ్డానో, నాలో నేను ఎంత నలిగిపోయానో నీకు తెలియదురా.. ”
ఏమైతేనేంలే మావయ్యా. జరగవలసింది జరిగిపోయిందిగా
నీకు సమకాలీన సమస్యల పట్ల అవగాహనే లేదురా
ఏంటి.. యాసిడ్ దాడులా.. ఇంకేం మాట్లాడకు మావయ్యా.. ఇంత పిరికివాడివి అనుకోలేదుమొదటిసారిగా ధిక్కార స్వరం.. తాడో పేడో తేల్చేసుకుందామనే కసి..
మా నాన్న నా చిన్నతనంలో ఎప్పుడూ మాట అనేవాడ్రా..
మా అక్కకి, అదే మీ అమ్మకు పెళ్లి కాక ముందు నుంచి అదే వరస. ఆడ బిడ్డకు మూడు ముళ్ళు వేయించేసానంటే, నా బాధ్యత తీరిపోతుంది. ఇక మగపిల్లలా.. గోచి పెట్టుకు తిరిగినా అడిగే నాథుడు లేడు అనేవాడు. మంచి రోజులు, చెడు రోజులు లేవు. సమయం, సందర్భం లేవు. ఎప్పుడు పడితే అప్పుడు. ఆయన ఆర్థిక పరిస్థితే అందుకు కారణమేమో. పదే పదే మీ అమ్మ పెళ్ళి గురించి ఆలోచించేవాడు. ఎట్టకేలకు శుభ ముహూర్తంలో కాస్తా ఘనకార్యం జరిపించేసాడు. ఇక చూడాలి ఆయన ఆనందం. .పట్టపగ్గాల్లేవనుకో.”


ఇవన్నీ నాకు తెలిసిన విషయాలే.. ఎన్నోసార్లు ఈయన చెప్పగా విన్నవే. ఇప్పటి చర్చకు దానికి సంబంధం ఏంటో అర్థం కాకున్నా ఆయన వాక్ప్రవాహానికి అడ్డు రాదల్చుకోలేదు. మళ్ళీ ఆయనే కొనసాగించాడు..

బాధ్యతలురా మాధవా.. ఆడబిడ్డ అంటేనే బాధ్యతలు, కష్టాలు, కన్నీళ్లు.. బిడ్డ పుట్టిన మరుక్షణం కలిగే ఆనందం దాన్ని అయ్య చేతిలో పెట్టేవరకేరా. దాన్ని తీరా అత్తారింటికి పంపాక చూడాలి పాట్లు. రేయ్.. అత్తగారింటికి వెళ్లిన కూతురు ఇంటి నుండి ఫోన్ వస్తే చాలు, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని హడలి చచ్చే తల్లిదండ్రులు నాకు తెలుసురా. ఉన్న ఆస్తులు హారతిగా చేసి, వాళ్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చినా ఏదో ఒక నెపంతో బిడ్డను కష్టపెడితే ఏం చేయాల్రా. కాలు కింద పెడితే కందిపోతాయేమోనని భయపడే కన్నతండ్రి తన కూతుర్ని దారుణంగా హింసించే వియ్యంకులను, అల్లుళ్లను ఏం చేయలేక గేటు బయట నుండి నిస్సహాయంగా కన్నీరు కార్చే సంఘటనలు కోకొల్లలురా

ఏం.. అందరూ ఒకేలా ఉంటారా ఏం. నువ్వు, మా నాన్న పెళ్ళాలను తన్ని తగలేసిన వారి జాబితాల్లో లేరుగా.. చేసిన తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో పొంతనలేని మాటలు మాట్లాడుతున్నావ్ మావయ్యా..”

కాస్తా నన్ను మాట్లాడనిస్తావా
తీవ్రవాదుల పుణ్యమా అని రోడ్డెక్కిన వాడు ఇంటికి వస్తాడో లేడో చెప్పలేని పరిస్థితి. గతంలో కేవలం ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలకే పరిమితమైన ర్యాగింగ్ భూతం కారణంగా కాలేజీకి వెళ్లిన బిడ్డ ఇంటికి వస్తాడో రాడో తెలియని దుస్థితి. రోడ్ల మీద ఈవ్ టీజింగ్ పుణ్యమాని ముక్కుపచ్చలారని విద్యార్థినులు అమానుష దాడులకు బలి అవుతున్నారు. రోజుల్లో ఉద్యోగాలకే కాదురా, ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో నాకేమైనా జరిగితే, ఇప్పటికే అవిటిదైన మీ అత్తయ్య ఆడబిడ్డతో ఎలా వేగుతుందిరా.. దానికి తగిన భద్రతను ఎలా ఇస్తుంది.”

ఎప్పుడో చస్తామనే భయంతో, ఇప్పుడే చచ్చిపోవాలనుకోవడం అవివేకం మావయ్యా. సహజంగా మరణించడం వేరే, బలవన్మరణం వేరే. రెండు పరస్పర భిన్నాభిప్రాయాలను నువ్వు ఒకే గాటిన కట్టేస్తున్నావ్. నువ్వు చనిపోయే పరిస్థితే వస్తే, అత్తయ్యను ఆదుకోవడానికి అయినవారం మేమంతా లేమాఆయన చెప్పేది కొంతవరకు నిజమనే అనిపిస్తూ ఉన్నా అంగీకరించలేని నైజం.

ఎవర్ని ఎవర్రా కాపాడేది. నువ్వు బంధాల గురించి మాట్లాడుతున్నావ్.. నేను వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాను.. అలా అని నేను చేసిందే కరెక్ట్ అని నేను వాదించను. కానీ, ఆడబిడ్డను కని, స్కూల్ రోజుల నుండి కాలేజీ రోజుల వరకు, ఆపై పెళ్లయ్యి అత్తవారింటికి వెళ్లాక, కడుపులు, కాన్పులు అంటూ వేగేందుకు నా తాహతు సరిపోదురా

నువ్వు చెప్పే కారణాలతోనూ నేను ఏకీభవించలేకున్నాను మావయ్యా..” అన్యమనస్కంగానే సంభాషణకు ముగింపు చెప్పాలనుకున్నాను..
సరే.. కొన్నాళ్లాగు.. నిజం నిలకడ మీద తెలుస్తుందినా గది నుండి మొదటిసారి తలవంచుకు వెళ్లిపోయాడు మావయ్య..

పగలంతా ఆహారం కోసం తిరిగి అలసిపోయిన పక్షులు గూళ్లకు చేరుకుంటున్నాయి..